- Advertisement -

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్

- Advertisement -

శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా.. స్ట్రీట్ రౌడీవా?” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆయన, కేసీఆర్‌పై చావు మాటలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రిని విమర్శించొద్దని స్పీకర్ చెబుతున్నారని ఆరోపించారు. “ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తానని స్పీకర్ ఆన్ రికార్డ్‌గా చెప్పడం ప్రజాస్వామ్యానికి అవమానం” అని అన్నారు.

బీఏసీ సమావేశంలో సభను 7 రోజుల పాటు నడిపి, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. కానీ సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడవాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తప్పుడు సమాచారం చేర్చారని ఆరోపించారు. స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారని విమర్శించారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని హరీష్ రావు స్పష్టం చేశారు. క్వశ్చన్ అవర్‌లో 10 ప్రశ్నలు అడగబోతే మైక్ కట్ చేశారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించలేదా? మరి ఇక్కడ సీఎం‌ను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిని విమర్శించవద్దని స్పీకర్ రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి అని అన్నారు. అవినీతికి అధికారికంగా రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్న రేవంత్ రెడ్డికి తమపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ, స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -