- Advertisement -

సీజ్‌ఫైర్ లేదు…ఇరాన్ హెచ్చరిక!

- Advertisement -

యుద్ధంలో ఇరాన్ సీజ్‌ఫైర్‌కు ఒప్పుకోదని….. యుద్ధం 22వ రోజుకు చేరిన నేపథ్యంలో, గతంలో జరిగిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చీ హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని పూర్తిగా ముగించే ఏ ప్రయత్నానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. వినడానికి, పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రస్తుతం అమెరికా తన దాడులను ఆపేలా కనిపించడం లేదు. అందువల్ల మేము మా రక్షణ కొనసాగిస్తాం అని అరఘ్చీ తెలిపారు.

యుద్ధం ముగియాలంటే అది పూర్తిగా, శాశ్వతంగా ముగియాలని, ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా గ్యారెంటీలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇరాన్‌కు జరిగిన నష్టానికి పరిహారం కూడా ఇవ్వాలని కోరారు. తమ చర్యలు పూర్తిగా స్వీయ రక్షణ కోసమేనని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు డోనాల్డ్ ట్రంప్… అమెరికా సైనిక పాత్రను త్వరలో తగ్గించే అవకాశం ఉందని సూచించారు. అమెరికా తన ప్రధాన లక్ష్యాలకు చాలా దగ్గరగా చేరుకుందని, యుద్ధం తుదిదశలోకి వెళ్తోందని తెలిపారు.యుద్ధానికి సరైన మద్దతు ఇవ్వలేదని ఆరోపిస్తూ, మిత్రదేశాలను “భయపడేవారు” అని అభివర్ణించారు. అమెరికా లేకుండా నాటో బలహీనమని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -