Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీ కిషన్ రెడ్డి నిద్రపోతున్నారా?

- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిద్రపోతున్నారా?, ప్రధానితో సహా కీలక జాతీయ నేతలంతా తెలంగాణ జపం చేస్తున్నా, రాష్ట్ర నేతలకు ఏమైంది…?ఎందుకు నిద్రమత్త వీడటం లేదు…ఇప్పుడు బీజేపీ కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తున్న ప్రశ్న ఇదే.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి ఆ పార్టీ పరిస్థితి ఒకడుగు ముందుకెస్తే పది అడుగులు వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యక్రమాలు చేస్తున్న ప్రజల్లో అంత రెస్పాన్స్ రావడం లేదు. దీనికి కారణం నేతల మధ్య సమన్వయలోపం ఒక వంతైతే..కిషన్ రెడ్డి ఒంటెద్దు పోకడలే కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి.

ఓ దశలో బీజేపీనే బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని భావించి ఇతర పార్టీల నేతలంతా కాషాయ పార్టీలోకి క్యూ కట్టారు. కానీ ఇప్పుడు వారి ఆశలు అడియాశలు కావడంతో తిరిగి ఘర్ వాపసీలో భాగంగా సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు కూడా. ఇక మరో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా అధ్యక్షుడి మార్పు జరగడంతోనే బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. దీనికి ప్రధానకారణం ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని వాదిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ అసంతృప్త నేతలకు ప్రధానంగా కనిపిస్తున్న పార్టీ కాంగ్రెస్.

అందుకే బీజేపీ కిషన్ రెడ్డి నిద్రమత్తు వీడాలని ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. ఇక బీజేపీలో అసంతృప్తిలో ఉన్న నేతల్లో ఈటెల రాజేందర్, రఘునందన్,,విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, రాజగోపాల్ రెడ్డి, రాజా సింగ్ పేర్లు వినిపిస్తుండగా వీరంతా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వీరితో పాటు చాలామంది కిషన్ రెడ్డితో టచ్‌లో లేరు. సరైన సమయం కోసం చూస్తున్న అసంతృప్త నేతలంతా బీజేపీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే పార్టీలో ఇంత జరుగుతున్న కిషన్ రెడ్డి మౌనంగా ఉండటం ఆ పార్టీ నేతలకు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రధాని మోడీ, అమిత్ షా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని సూచిస్తున్నారు. మరీ ఇప్పటికైనా కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై వారు స్పందిస్తారో లేదో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -