Thursday, May 16, 2024
- Advertisement -

వైరల్‌:చంద్రబాబు వసూలు చేసింది రూ.143 కోట్లా?

- Advertisement -

ఐటీ నోటీసుల రూపంలో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్‌ డబ్బులు ఎలా చేతులు మారాయో స్వయంగా వివరించగా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఐటీ నోటీసులు రావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఐటీ నోటీసులపై టీడీపీ నేతలు ఇంతవరకు స్పందించకపోవడంతో చంద్రబాబు చేసిన అవినీతి సాక్ష్యాలతో సహా బయటపడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం మొత్తం జరిగిందిలా… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలోని సచివాలయం, అసెంబ్లీ, కోర్టు భవన నిర్మాణాల్లో భారీగా వసూళ్లు జరిగాయని గుర్తించింది ఐటీ శాఖ. బోగస్‌ కంపెనీలను సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో భారీగా డబ్బులు చేతులు మారాయి. మొత్తం 7 వేల కోట్ల పనుల్లో ఐదు శాం కమిషన్ రూ.143 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే ఐటీ శాఖ రూ.118 కోట్లకు సంబంధించిన దానిపై నోటీసులు జారీ చేసింది.

మనోజ్‌తో పాటు శ్రీనివాస్‌ల ఇళ్లపై ఐటీ శాఖ రైడ్ చేయగా ఈ అవినీతి బాగోతం బయటపడింది. ఈ సందర్భంగా వీరిద్దరి దగ్గరి నుండి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసి బాబుకు నోటీసులు ఇచ్చారు ఐటీ అధికారులు. శ్రీనివాస్ (చంద్రబాబు పీఏ)..మనోజ్‌ను వినయ్‌,విక్కీకి అటాచ్ చేశారు. దీంతో వినయ్ మూడు కంపెనీలు, విక్రీ మరో రెండు బోగస్ కంపెనీలను మనోజ్‌కు అప్పజెప్పారు. ఈ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడం ద్వారా డబ్బులు వసూలు చేశారు. ఇదంతా ఓ చెయిన్ సిస్టమ్‌లా జరిగింది. ఈ వ్యవహారం అంతా ఐటీ అప్రోజల్ రిపోర్టులో స్పష్టంగా ఉంది. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ మాత్రమే కాదు ఎల్‌ అండ్ టీ నుండి కూడా వసూలు చేసే బాధ్యలు మనోజే తీసుకున్నారు. చంద్రబాబుకు దూబాయ్‌లో నేరుగా రూ. 15.14 కోట్లను దినార్లను క్యాష్‌ రూపంలో ఇచ్చినట్టు ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాపూర్ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ అంగీకరించారు.

2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్‌ తనను కలిసి.. పార్టీకి ఫండ్‌ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ… ఐటీకి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 2019 జనవరిలో స్వయంగా చంద్రబాబే షాపూర్‌ జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవాల్సిందిగా ఆదేశించినట్లు ఐటీ అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. అయితే తొలుత షాపూర్‌ జీ పల్లోంజి కంపెనీ ఈ తరహాలో నిధులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. కావాలంటే పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పింది. దాంతో తాము చెప్పినట్టు ముడుపులు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ బెదిరించినట్టు మనోజ్‌ వాసుదేవ్‌ తన వాంగ్మూలంలో ఐటీ అధికారులకు వెల్లడించారు. అలా ఆ కంపెనీ నుంచి వచ్చిన ముడుపుల వ్యవహారాన్ని పీఏ శ్రీనివాస్‌ కూడా ఐటీ అధికారుల ముందు అంగీకరించారు. ఈ విషయాన్ని ఐటీ అప్రైజల్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన రిపోర్టు పత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -