- Advertisement -

అసమ్మతి నేతలు సైలెంట్ అయినట్లేనా?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద మొదలైన సంగతి తెలిసిందే. సీట్లు ఆశీంచి భంగడ్డ నేతలు కొంతమంది పార్టీని వీడితే మరికొంతమంది ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. అయితే వారిని బుజ్జగించేందుకు ఏకంగా కాంగ్రెస్ హైకమాండే రంగంలోకి దిగింది.

ఈ క్రమంలో అసమ్మతులను బుజ్జగించేందుకు హస్తం పార్టీ నేతలు చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చిందనే చెప్పాలి. డజనుకు పైగా నేతలు నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తారా లేదా అన్నది ఇంకా సందిగ్దంగానే ఉంది.

ఇక నామినేషన్ విత్ డ్రా చేసుకున్న నేతల్లో ప్రధానంగా సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. మల్లు రవి స్వయంగా వెళ్లి బుజ్జగించడంతో ఆయన అంగీకారం తెలిపి పార్టీ నేత దామోదర్ రెడ్డి గెలుపుకు సహకరిస్తానని చెప్పారు. వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రామిరెడ్డి,బాన్సువాడలో కాసుల బాలరాజు, జుక్కల్ లో గంగారామ్, డోర్నకల్ లో నెహ్రూనాయక్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇక టికెట్ దక్కని నేతలు రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ, అద్దంకి దయాకర్‌కు వరంగల్ ఎంపీ టికెట్ హమీ దక్కినట్లు సమాచారం. ఇక నామినేషన్లు ఉపసంహరించుకున్న వారికి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపినట్లు సమాచారం. అయితే ఇప్పుడు వీరంతా పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేస్తారనేది మాత్రం హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -