ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ నిన్న చేసిన— “కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది” అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా జగదీశ్ రెడ్డి కాస్త తీవ్రంగానే ప్రతిస్పందించారు.
“అసలు మా దిష్టి వాళ్లకు తగిలిందేమీ కాదు… ఎన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు తగిలింది. మెదడు వాడకుండా, నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్లు కూడా ఇరోజు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోవడం విచిత్రం” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా పవన్‌ను లక్ష్యంగా చేసుకున్నవేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్‌పై పవన్ చేసిన విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు. “తాకితే మా దిష్టే మీ హైదరాబాద్‌కు తాకాలి… కానీ ఈ నగరాన్ని నడిపింది తెలంగాణ ప్రజల తెలివి, కష్టమే తప్ప ఎవరి దిష్టీ కాదు” అని స్పందించారు.
