యాడ్ ఏజెన్సీ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందన్నారు మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్. వేరేవాళ్లకు దక్కాల్సిన క్రడెట్ చోరీ చేయడంలో చంద్రబాబు పీక్ .. పర్ఫామెన్స్‌లో మాత్రం చంద్రబాబు వీక్ అని ఆరోపించారు.
ఒక్క ములకలచెరువులోనే 20,208 బాటిళ్ల నకిలీ మద్యం దొరికింది..మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు అన్నారు. 30 క్యాన్లల్లో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్ల స్పిరిట్ కూడా లభ్యమైంది … ఆర్గనైజ్డ్‌గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేశ్ కు మాత్రమే సాధ్యం అన్నారు.
విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడింది.. పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు బయటపడ్డాయి… పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడు అన్నారు.
టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు…పరవాడలో నకిలీ మద్యం చేస్తోంది అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము,
చూడు ఎంత చక్కగా నవ్వుతున్నారో.. స్మార్ట్‌గా ఉన్నారు ఇద్దరూ అని ఎద్దేవా చేశారు జగన్.
