- Advertisement -

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల తమ ఇంటిపై జరిగిన దాడి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ ఇంటికి వస్తున్నారనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చమటలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు మోహరించినా, ఆయనను చూడడానికి వచ్చిన అభిమానులను ఆపడం సాధ్యమా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం కావాలనే అల్లర్లు సృష్టించి, వాటికి వైసీపీని బాధ్యులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని రోజా ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా కర్రలు, రాడ్లు పట్టుకుని తిరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆమె అన్నారు.

ఇళ్లపై దాడుల వెనుక మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందా లేదా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు. తిట్టారని చెప్పి దాడులు చేశామని సిగ్గులేకుండా సమర్థించుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఇలాంటి వాదనలు ప్రజాస్వామ్యానికి, చట్టపాలనకు తీరని మచ్చ అని అన్నారు.

అంతేకాదు, హిందువులకు సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్షాన్ని అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే అన్నిటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని రోజా హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -