సత్య శోధనకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా..? అని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్. చిల్లర పాలిటిక్స్ కోసమా.. ఆ ముఖ్యమంత్రి సీటులో చంద్రబాబును కూర్చోబెట్టింది చెప్పాలని ప్రశ్నించారు.
రెడ్ బుక్‌కి ఫైర్ పుట్టిస్తా.. ఛాలెంజ్ చేసి చెబుతున్నా.. చంద్రబాబు తిరుపతి రాకపోయినా.. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేయగలవా..? అని సవాల్ విసిరారు.
నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదు అని… నకిలీ మద్యం తయారీలో టిడిపి నేతలే ఉన్నారు అన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారైంది… మాయ చేసి ఎదుటి వాళ్లపై బురద జల్లడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఈ నకిలీ మద్యం విషయం లో సిబిఐ తో విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు. నకిలీ మద్యం ద్వారా పేదల జీవితాలను నాశనం చేశారు… ఇప్పుడు రాజకీయంగా నా పై బురద జల్లుతున్నారు అన్నారు.
