- Advertisement -

సీఐ తుపాకీ పెట్టి బెదిరించాడు..కూనంనేని సంచలనం!

- Advertisement -

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అభ్యర్థిని నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని ఒక సీఐ తుపాకీతో బెదిరించాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలవాలి. పోలీసులను ఉపయోగించి బెదిరింపులు చేయడం దేనికి? మా సీపీఐ అభ్యర్థిని గన్ పెట్టి బెదిరించడం ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు.

ఇక రాజకీయ పరిణామాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కాం విషయంలో కలిసి పోరాటం చేద్దామని, మేయర్ పదవి మీరే తీసుకోండి అంటూ Bharat Rashtra Samithi ఓపెన్ ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. అయితే ఎన్నికల ముందు పొత్తు లేదని చెప్పి, చివరికి అధికార కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషమని అన్నారు.

కార్పొరేషన్ మేయర్ పదవిని సగం కాలం చొప్పున పంచుకునేలా సీపీఐ ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. ఒకవైపు బెదిరింపులు, మరోవైపు రాజకీయ ఒప్పందాలు జరగడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని, ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -