- Advertisement -

ఫోన్ ట్యాపింగ్..కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తనపై వ్యక్తిగత హననం జరుగుతోందని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యాంగం ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని, దీనిని రాజకీయ కక్ష్య సాధింపుగా చిత్రీకరించడం సరికాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి నిజంగా రాజకీయ ప్రతీకార ధోరణి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ అలా జరగలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను అక్రమంగా వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టేనని, ఇది తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉన్నాయని ఎద్దేవా చేశారు. తప్పు చేసి బాధ్యత తప్పించుకునేందుకు “బట్ట కాల్చి మీద వేసి పారిపోతామంటే కుదరదు” అని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అలీబాబా–420 దొంగల మాదిరిగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.

తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే, ఆ ఆరోపణలకు సరైన సమాధానం లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్లో నిజాలు బయటకు రావాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -