Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీ – జనసేన కూటమిలో ముసలం..?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొత్త పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు బీజేపీతో ఉన్న పవన్ సడన్‌గా తన నిర్ణయాన్ని మూర్చుకుని టీడీపీతో అడుగులు వేశారు. పార్టీ నేతలెవరితో చర్చించకుండానే చంద్రబాబుతో ములాఖత్ తర్వాత టీడీపీతో పొత్తును అనౌన్స్ చేశారు. పొత్తు ప్రకటించడమే తరువాయి సీట్ల పంపకం, మేనిఫెస్టో రూపకల్పన అంటూ నానా హంగామా చేశారు. కానీ రోజురోజుకు టీడీపీ – జనసేన నేతల్లో పొత్తుపై టెన్షన్‌ నెలకొంది. ఎవరికి సీటు దక్కుతుందో దక్కదో తెలియని పరిస్థితి.

కానీ ఇప్పుడు ఈ కూటమి నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. నాయకులైతే కలుస్తున్నారు కానీ కింది స్ధాయి క్యాడర్‌ మాత్రం అంత ఈజీగా కలిసే పరిస్థితి కనిపించడం లేదు.ఇటీవల పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో ఇది స్పష్టంగా కనిపించింది. స్వయంగా నారా లోకేష్ పిలుపిచ్చినా టీడీపీ క్యాడర్ మాత్రం పవన్‌ యాత్రను లైట్‌గానే తీసుకున్న పరిస్థితి ఉంది.అందుకే టీడీపీ – జనసేన నేతల సమన్వయం కోసం 5గురు మెంబర్స్‌తో కమిటీ వేశారు.

నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం, లోటుపాట్లను సరిదిద్దడం ఈ కమిటీ పని. అలాగే రెండు పార్టీల నుండి టికెట్ ఆశీస్తున్న నేతలతో వేర్వేరుగా లేదా కలిసి సమావేశం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ అది అంత ఈజీగా అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే టికెట్ దక్కని నేతలు ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఖాయం. ఇది ఇప్పటికే తెలిసిపోయింది. ఎందుకంటే పవన్ వారాహి యాత్ర ముగియగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు జనసేన నేతలు. సో టీడీపీ – జనసేన పొత్తుతో టీడీపీకి లాభం జరిగితే జరుగుతుండొచ్చు కానీ జనసేనకు మాత్రం నష్టమే. టికెట్ దక్కకపోతే వైసీపీలో చేరేందుకు పెద్ద ఎత్తున నేతలు సిద్ధమవుతున్నారని సమాచారం.ఇలాంటి పరిస్థితుల్లో నేతలు కలిసినా కింది స్ధాయిలో క్యాడర్ కలిసి పనిచేయడం అసాధ్యమనే టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -