- Advertisement -

అంబటి రాంబాబుపై మరో కేసు

- Advertisement -

వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై గుంటూరు పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడం, ప్రజా జీవనానికి అంతరాయం కలిగించడం వంటి ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.

తన నివాసంపై జరిగిన దాడికి నిరసనగా, సదరు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు శనివారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అంబటి రాంబాబు చేపట్టిన ఈ దీక్షకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టరేట్ వంటి రద్దీ ప్రాంతంలో దీక్ష చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగిందని పోలీసులు పేర్కొన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అనుమతి లేకుండా గుమిగూడటం వంటి సెక్షన్ల కింద అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని వదిలేసి, న్యాయం చేయాలని కోరుతున్న తనపైనే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -