Friday, March 29, 2024
- Advertisement -

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

- Advertisement -

రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ విధానం కొంత్తేమీ కాదు. అనాది కాలం నుంచి రాజకీయ నాయకులు పార్టీలు మారడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీవైపు నాయకుల చేరికలు ఎక్కువగా ఉంటాయి. లేదా ప్రజల్లో పార్టీల బల బలాలను బేరీజు వేసుకొని ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుంటారు ప్రజా ప్రతినిధులు. కానీ ప్రస్తుతం తెలంగాణలో జంపింగ్ జపాంగ్ విధానం కాస్త విడ్డూరంగానే ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు అయిన టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి మూడు పార్టీలలో చేరికలు నెలకొంటున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ కి చెందిన నలుగురు జి‌హెచ్‌ఎం‌సి కార్పొరేటర్లు టి‌ఆర్‌ఎస్ లో చేరారు. .

అలాగే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకుడు కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక టి‌ఆర్‌ఎస్ కు చెందిన కొంతమంది మాజీలు, జిల్లా పరిషత్ చైర్మెన్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ విధంగా అన్నీ పార్టీలలో కూడా చేరికలు సమపాళ్లలో జరుగుతుంటే తెలంగాణలోని జంపింగ్ జపాంగ్ విధానం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది మరి. ఎందుకంటే సహజంగా బలహీన పార్టీ వైపు నుంచి బలమైన పార్టీ వైపుకు, లేదా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ వైపుకు మొగ్గు చూపుతుంటారు ప్రజా ప్రాతినిధులు ప్రస్తుతం అన్నీ పార్టీలలో కూడా చేరికలు ఏర్పడడం కాస్త ఆసక్తి కలిగించే అంశం.

దీన్ని బట్టి చూస్తే తెలంగాణలోని ప్రధాన పార్టీలు అన్నీ ఆపరేషన్ ఆకర్ష్ పైన గట్టిగానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొరకు ఈటెల రాజేందర్ ను రంగంలోకి దించింది. దాంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న టి‌ఆర్‌ఎస్ నుంచి పెద్ద మొత్తం లో నాయకులను బీజేపీ లోకి లగేందుకు ఈటెల గట్టిగానే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక టి‌ఆర్‌ఎస్ కూడా అటు బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలను ఆకర్శించేందుకు కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే పిసిసిఐ చైర్మెన్ రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి వారు ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా మూడు పార్టీల వ్యవహార శైలి చూస్తుంటే రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే ఆపరేషన్ ఆకర్ష్ పై గట్టిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read

జగన్ కు షాక్.. తల్లి విజయమ్మ రాజీనామా !

పిల్లల విషయంలో.. జగన్ తప్పుచేస్తున్నారా ?

ఆసక్తి రేపుతోన్న జగన్ ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -