అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరగబోయే మ్యాచ్‌లకు భారత ‘ఏ’ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు రిషబ్ పంత్. ఈ సిరీస్ పంత్‌కు గాయాల నుండి కోలుకున్న తర్వాత మళ్లీ పోటీ క్రికెట్‌లోకి తిరిగి ప్రవేశించడానికి సూచికగా నిలుస్తోంది.
ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్టులో కాలివేలి విరగడంతో పంత్ కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. ఆ గాయం కారణంగా ఇంగ్లాండ్‌లోని ఐదో టెస్ట్ మరియు వెస్టిండీస్‌పై జరిగిన రెండు హోం మ్యాచ్‌లను పంత్ మిస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన మళ్లీ భారత సీనియర్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించే అవకాశముంది.
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఈ రెండు మ్యాచ్‌ల కోసం వేర్వేరు జట్లను ప్రకటించింది. సాయి సుదర్షన్ వైస్‌కెప్టెన్‌గా నియమితులయ్యాడు. జత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోగా, ఆయుష్ బడోని తన స్థానాన్ని కొనసాగించాడు. వారితో పాటు బ్యాటింగ్ విభాగంలో టెస్ట్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న దేవదత్ పడిక్కల్, సుధర్షన్ మరియు ఎన్ జగదీశన్ ఉన్నారు. జట్టులోని ఇతర సభ్యులుగా ఆల్‌రౌండర్లు హర్ష్ దుబే, తనుష్ కోటియన్, మనవ్ సుతార్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో యష్ ఠాకూర్, అంషుల్ కాంబోజ్ మరియు సరాంశ్ జైన్ ఉన్నారు.
భారత ‘ఏ’ జట్టు – మొదటి నాలుగు రోజుల మ్యాచ్:
రిషభ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ఆయుష్ మ్హాత్రే, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుధర్షన్ (ఉపకెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దుబే, తనుష్ కోటియన్, మనవ్ సుతార్, అంషుల్ కాంబోజ్, యష్ ఠాకూర్, ఆయుష్ బడోని, సరాంశ్ జైన్.
భారత ‘ఏ’ జట్టు – రెండవ నాలుగు రోజుల మ్యాచ్:
రిషభ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), కె.ఎల్. రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుధర్షన్ (ఉపకెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దుబే, తనుష్ కోటియన్, మనవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరణ్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.
మొదటి నాలుగు రోజుల మ్యాచ్: అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బెంగళూరు
రెండవ నాలుగు రోజుల మ్యాచ్: నవంబర్ 6 నుంచి నవంబర్ 9 వరకు – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బెంగళూరు
