దాడులకు భయపడే వ్యక్తికాదు జగన్!

దాడులకు భయపడే వ్యక్తి జగన్ కాదన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..దాడి వెనక ఉంది ఎవరనేది పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తుందన్నారు. మా పార్టీ నేతలు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు.

ప్రజల్లో ఉంటున్న నేతకు భద్రత చాలా అవసరం అని…కానీ చంద్రబాబు , లోకేశ్ లా భద్రత హడావిడి అలవాటు తమకు లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదని…రాజకీయాల్లో జగన్‌ని దీటుగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాయి కొంచెం కిందకి తగిలి ఉంటే జగన్ కంటికి ప్రమాదం జరిగేదని..వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైందని చెప్పారు. ఈ ఘటన సీరియస్ గా చూడాల్సిన అవసరం ఉందని…ఇద్దరికి ఒకే రాయి తగిలిందంటే ఎంత ఫోర్స్‌గా విసురుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. దోషులు ఎవరో పోలీసుల విచారణలో బయటకు వస్తుందన్నారు.