లిక్కర్ స్కాంలో నా కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. గవర్నమెంట్ లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని చెప్పడానికి ఎక్కడా ఈ ప్రభుత్వానికి అవకాశం దొరకలేదు… లేని లిక్కర్ స్కాం మీద ప్రజల బుర్రల్లో విషం నింపాలన్నదే చంద్రబాబు ప్రయత్నం అని మండిపడ్డారు.
తల్లి కొడుకుల మధ్య గొడవ జరగాలని ఎదురుచూసే దరిద్రుడు ఎవరైనా ఉంటారా?…నారా లోకేష్ అలాగే ఎదురుచూస్తున్నాడన్నారు. నారా చంద్రబాబు తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉంటున్నాడా? తన చెల్లెలు, తమ్ముడికి తన వెయ్యి కోట్ల ఆస్తిలో ఎంత పంచాడు? చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు… రాష్ట్రంలో 7 లక్షల టన్నుల ఎరువు అవసరం కాగా అందులో సగానికిపైగా స్టాక్ బ్లాక్ మార్కెట్ కు తరలించారు అన్నారు.
ప్రజల సమస్యలు టీడీపీ నాయకులు లాభపడడానికి పనికొస్తున్నాయి… యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుంటే అవన్నీ ఫేక్ వార్తలు అంటూ బరితెగించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలు టీడీపీ నాయకులు లాభపడడానికి పనికొస్తున్నాయి అని ఆరోపించారు.
