- Advertisement -

మిథున్ రెడ్డిపై సిట్ సోదాలు

- Advertisement -

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసింది కూటమిప్రభుత్వం. ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలపై వైసీపీ అనుమానం వ్యక్తం చేసింది. మిథున్ రెడ్డి కార్యాలయాల్లోనూ సిట్ తనిఖీలు.. ఇప్పటికే అనేకసార్లు మిథున్ రెడ్డిని విచారించింది సిట్. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని విచారించింది సిట్.

నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు మిథున్ రెడ్డి. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్ళీ మిథున్ రెడ్డి ని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింద‌ని వైసీపీ ఆగ్ర‌హం వ్యక్తం చేసింది.

వైఎస్ఆర్‌సీపీ ఒత్తిడితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మరో SIT‌ను ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్‌సీపీ, టిడిపి నాయకులు ఈ స్కామ్‌లో భాగమని ఆరోపిస్తూ, కేసును సీబీఐకి అప్పగించాలని సవాలు విసిరింది. వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రకారం, అసలు నిందితులను కాపాడటానికే టిడిపి ప్రభుత్వం కొత్త SIT‌ను ఏర్పాటు చేసిందని ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -