Sunday, May 5, 2024
- Advertisement -

ఇంతకీ బాలయ్య..లిమిటెడ్ ఎడిషనేనా?

- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు…నిన్నటి వరకు కలిసున్న నేతలు హటాత్తుగా విడిపోతారు…?ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు..?ఇక పొత్తు సంగతి సరాసరి..?ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో చెప్పని పరిస్థితి. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇక ఇప్పుడు ఏపీ టీడీపీలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.

అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత అప్పటివరకు పాలిటిక్స్ పార్ట్ టైమ్ అనుకున్న సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అకస్మాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. స్టార్ట్, యాక్షన్ అన్నట్లు ఏకంగా చంద్రబాబు సీటులోనే కూర్చొని పార్టీ నేతలను కదిలించారు. దీంతో టీడీపీ శ్రేణుల ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ తర్వాత పవన్‌తో కలిసి బాబుతో ములాఖత్ కూడా అయ్యారు బాలయ్య.

కానీ సీన్ కట్ చేస్తే తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి ఎంటరయ్యారు. దీంతో బాలయ్య ఎపిసోడ్ మెల్ల,మెల్లగా సైడ్డ అయి పోయింది. ఇక బ్రాహ్మణి, భువనేశ్వరి పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారని రోజుకో వార్త రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. బ్రాహ్మణి పాదయాత్ర, భువనేశ్వరి బస్సుయాత్రకు సర్వం సిద్ధమవుతోంది కూడా. ఇక బాలయ్యను అంతా మర్చిపోతున్న తరుణంలో ఒక్కసారిగా నేనున్నా అంటూ ముందుకొచ్చారు.

ఇకపై తన దృష్టి ఏపీపై కాదని తెలుగు రాష్ట్రాలపై అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జగన్‌ సంగతి పక్కనపెట్టి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు కూడా.దీంతో బాలయ్య ప్రకటన చూసి తెలుగు తమ్ముళ్లే ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో టీడీపీ నేతలు ఎక్కడా ఆందోళన చేసిన సందర్భాలు లేవు. ఈ క్రమంలో బాలయ్య ఏపీలో కీలకంగా వ్యవహరించాల్సింది పోయి, తెలంగాణలో ప్రచారం చేస్తానని చెప్పడం ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య చెబితే టీడీపీ సీనియర్లే వినలేని పరిస్థితి ఉంది.ఇక ఇన్నాళ్లు బాబు ఉండటంతో బాలయ్య ఏ కార్యకర్తను కలిసింది లేదు. ఇక తెలంగాణలో కనీసం సమావేశాల్లో పాల్గొంది కూడా లేదు. ఇలాంటి తరుణంలో ఏం ఆశించి బాలయ్య అలాంటి వ్యాఖ్యలు చేశారో అర్ధం కాని పరిస్‌థితి. ఇక బాబు రిమాండ్‌లో ఉన్నా ఆయన డైరెక్షన్‌లో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే అప్పుడప్పుడు నేనున్నా అంటూ గుర్తుచేసేందుకే బాలయ్య ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి అంతా తానై ఉండాలని భావించిన బాలయ్యకు ఆ ఆశ తీరకుండానే భువనేశ్వరి రూపంలో చెక్ పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -