పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 291 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మమతా బెనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 294 స్థానాల్లో 291 స్థానాల్లో టీఎంసీ పోటీ చేస్తుంది. మిగిలిన 3 స్థానాల్లో దార్జిలింగ్ ప్రాంతంలో బీజీపీఎం పోటీ చేస్తోంది.
మొత్తం అభ్యర్థుల్లో 52 మంది మహిళలు ఉండగా 95 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, 47 మంది మైనార్టీ వర్గాలకు చెందినవారున్నారు. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఆమెకు ప్రత్యర్థిగా నిలవనున్నారు
శశి పాంజా – శ్యాంపుకూర్
సోహమ్ చక్రబోర్తి – చందీపూర్
జ్యోతిప్రియ మల్లిక్ – హబ్రా
ఫిర్హాద్ హకీం – కొలకతా పోర్ట్
మదన్ మిత్రా – కామర్హాటి
ఇక కొత్త అభ్యర్థుల్లో మాజీ జర్నలిస్ట్ దేవదీప్ పురోహిత్ ఖర్దాహ్ నుంచి పోటీ చేస్తున్నారు. కళ్యాణ్ బెనర్జీ కుమారుడు ప్రభాత్ బెనర్జీ ఉత్తరపారా నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రధానంగా టీఎంసీ మరియు బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీజేపీ ఇప్పటికే 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
