Saturday, May 4, 2024
- Advertisement -

గజ్వేల్‌లో ఈటల..మరి కామారెడ్డిలో ఎవరు?

- Advertisement -

తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ అవుతోంది. ఇవాళో రేపో లిస్ట్ రిలీజ్ కానుండగా ఎవరెవరు ఏ స్థానం నుండి పోటీచేస్తారోనని ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక ముఖ్య నేతలు ఏ స్థానం నుండి పోటీచేస్తారనే దానిపై సస్పెన్స్ ఉండగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ విడుదలయితే కానీ దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.

ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన ఈటల ఇందుకు అనుగుణంగానే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామరెడ్డి రెండు స్థానాల నుండి బరిలో దిగుతుండటంతో ఈటల సైతం హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్ల నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు బాగానే ఉన్న కామారెడ్డి నుండి బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారన్నదే ప్రశ్న.

ప్రముఖంగా బండి సంజయ్, విజయశాంతి పేరు వినిపిస్తున్న ఇందులో బండి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి తాను కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించిన లోలోపల మాత్రం భయపడుతున్నారని టాక్. దీంతో కామారెడ్డిలో సీఎంపై బీజేపీ తరపున పోటీ చేసే నేతలే లేరా అన్న వాదన కూడా తెరపైకి వస్తోంది.

తెలంగాణలో అధికారం మాదేనని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్న బీజేపీకి కొన్ని స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉంది. ఒకవైపు నేతల విభేదాలు, మరోవైపు పార్టీలో చీలిక, అసమ్మతి సెగ వెరసీ బీజేపీకి ఎన్నికల వేళ కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ ఎత్తుగడ ఎలా ఉండబోతోంది.. ఎన్నికల వేళ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -