- Advertisement -

బోట్ల ఓనర్లు ఎవరు..ఎవరికి సన్నిహితులు!

- Advertisement -

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ ప్రమాదంపై మరోసారి కామెంట్ చేశారు మాజీ సీఎం జగన్. బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్‌ వచ్చింది? అందరికి తెలుసు అన్నారు.చంద్రబాబు ప్రభుత్వం రాగానే విజయోత్సవ ర్యాలీలో ఈ బోట్లు లేవా? ఆలోచించాలన్నారు. బోట్ల ఓనర్లు ఉషాద్రి నారా లోకేశ్‌తో కలిసి ఫోటో దిగారని తెలిపారు జగన్. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాం సోదరుడి కుమారుడే కోమటి రామ్మోహన్ అని చెప్పారు. బోట్ల గురించి వాస్తవాలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

ఇక రాష్ట్రంలో రెయిన్‌గేజ్ మీట‌ర్లు చెడిపోయాయ‌ని అందుకే వ‌ర్షం ఎంత ప‌డుతుందో చంద్ర‌బాబుకు తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. ఈనాడు దిన‌ప‌త్రిక‌ ఎంత దుర్మార్గంగా రాస్తోంది అంటే.. రాష్ట్రంలో 1,599 ఆటోమేటెడ్‌ వెదర్‌ స్టేషన్స్‌ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిని ఇంకా మేము బ‌ల‌ప‌రుస్తూ మా హ‌యాంలో మ‌రో 450 కొత్త‌వి ఏర్పాటు చేశాం… ఇవ‌న్నీ ఉన్నాయి కాబట్టి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎక్క‌డ ఎంత వ‌ర్ష‌పాతం ప‌డిందన్నారు.

తుఫాన్ రాబోతోందని 3 రోజుల ముందే చంద్రబాబుకి అలెర్ట్ వెళ్లిందన్నారు జగన్. బోలెడంత టైమ్ ఉన్నా.. ఉన్నతాధికారులతో కనీసం రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు అన్నారు. చంద్రబాబు తప్పిదంతోనే వరదల్లో 60 మందిపైగా చనిపోయారు… నీపై ఎందుకు నెగ్లజెన్సీ కేసు పెట్టకూడదు అని ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -