Monday, May 6, 2024
- Advertisement -

జగన్‌ మాస్టర్ స్కెచ్…రెండోసారి పక్కా?

- Advertisement -

ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు జగన్. ఇక ఆ సంక్షేమ పథకాలే జగన్‌ని గట్టెక్కిస్తాయని వైసీపీ నేతలు సైతం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

ఇక సంక్షేమ పథకాలతో పాటు బీసీ సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకుని గతంలో వచ్చిన మెజార్టీ కంటే మరింత ఎక్కువ మెజార్టీ సాధించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో కులగణన చేపట్టి వారికి సంక్షేమ పథకాలు మరింత చేరువయ్యేలా చేయడంతో పాటు చట్ట సభల్లో ఆయా సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా మాస్టర్ ప్లాన్ వేశారు. వాస్తవానికి జగన్‌ 2019లోనే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వగా అది సత్ఫలితాన్నిచ్చింది. ఆ ఎన్నికల్లో జగన్ బీసీలకు 31 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో రెడ్డి, కమ్మ నేతలు పోటీ చేసే స్థానాలున్న జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

తాజాగా బీసీలు పోటీ చేసే స్థానాలను మరింత పెంచే ఆలోచనలో ఉన్నారట జగన్. ఆ పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 40కి పైగా స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.బీసీ నేతల్లో కూడా ఆశావాహుల సంఖ్య పెరగడంతో వారిని నిరాశపర్చకుండా సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట జగన్. సీట్లు దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారట. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలను జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఛైర్మన్లుగా నియమించి వారికి ప్రాధాన్యతను కల్పించారు. తాజాగా జనరల్ సీట్లలో కూడా బీసీలను దింపే ఆలోచన చేస్తుండటంతో టీడీపీ డిఫెన్స్‌లో పడింది. ఇక బీసీలు సైతం జగన్ సర్కార్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని జగన్ వదులుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -