ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా ఇడుపుల పాయలో నివాళి అర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. అనంతరం విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు.
తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సీఎంగా మీరు ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కృష్ణలంక వాసులు. రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా మా జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని భరోసానిచ్చారు జగన్.
భారీ వర్షాలతో విజయవాడ జలమయం కాగా కరకట్టపై మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి చొచ్చుకెళ్లింది వరద నీరు. ఆశ్రమంలో ఉన్న వారిని ఖాళీ చేయించిన పోలీసులు.. అదే కరకట్టపై ఉన్న ఇంట్లోకి వరద నీరు చేరింది. గంట గంటకీ వరద ఉద్ధృతి పెరుగుతుండగా ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మూడు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన కూటమి ప్రభుత్వం అవగాహనలోపం, అలసత్వంతో వరద ముంపులో చిక్కుకున్నామని విజయవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బోటుపై హడావుడి చేస్తూ వచ్చిన చంద్రబాబుని చూసి.. పైపైన తిరగడం కాదు లోపలికి వచ్చి మా దుస్థితిని చూడమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తిండి లేదు, మంచి నీళ్లు లేవంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు చంద్రబాబు.
