- Advertisement -

వైసీపీ నేతలపై దాడులే..టీడీపీ పాలనా?

- Advertisement -

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్‌కే రోజా. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యాలయాలు మాత్రమే కాదు… మీడియా సంస్థలు కూడా దాడులకు గురవుతున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతోందన్నారు.

ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. అదే తరహాలో జోగి రమేష్, వలభనేని వంశీ, కొడాలి నాని, పెర్ని నాని, ముద్రగడ పద్మనాభం, నల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు రెడ్డప్ప వంటి పలువురు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. హిందూపుర్ వైసీపీ కార్యాలయం ధ్వంసం చేయడం, మార్గాని భరత్ కార్యాలయంపై దాడి, నంబూరి శంకర్రావు ఆఫీస్‌పై దాడి కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు.

దాడిశెట్టి రాజా, ఉప్పల హారికా, ఉప్పల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లపై దాడులు జరిగాయి. దేవినేని అవినాష్, విడదల రజినీలపై దాడికి యత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నా మీద కూడా ఆర్పీని పెట్టి దూషణాత్మక దాడులు చేశారని గుర్తు చేశారు రోజా.

ఇక మీడియా స్వేచ్ఛపై కూడా దాడులు జరుగుతున్నాయి. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై, సాక్షీ కార్యాలయాలపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం. చంద్రబాబు గారు… ఇదేనా మీరు చెప్పే “రూల్ ఆఫ్ లా”? ఈ రాష్ట్రంలో చట్టపాలన ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో బలపడుతోందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -