- Advertisement -

జగన్ హయాంలోనే ఏపీకి ReNew ప్రాజెక్ట్!

- Advertisement -

దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామి సంస్థ అయిన ReNew ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చింది వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ReNew కంపెనీ సీఈఓ సుమంత్ సిన్హా గతంలో మాట్లాడిన ఒక వీడియోను వైసీపీ నాయకులు విడుదల చేశారు.

గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి ReNew కంపెనీని పంపేశారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని వైసీపీ ఖండించింది. వాస్తవానికి, 2023 జూన్ 20న ReNew ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తూ జగన్ ప్రభుత్వం జీవో 15 ను జారీ చేసిందని వైసీపీ గుర్తు చేసింది.

ముఖ్యంగా, విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ (GIS) లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ReNew కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల మేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ReNew ప్రాజెక్టు కోసం భూములను కూడా కేటాయించినట్లు వైసీపీ తెలిపింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించడంలో జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తుందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. లోకేశ్ అనవసరపు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.

వైయస్ జగన్ హయాంలో మూడేళ్ల పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం.1 ర్యాంక్‌లో ఉన్నమాట వాస్తవం కాదా? దాని గురించి మాట్లాడవే? అని నారా లోకేష్‌కు చురకలు అంటిస్తున్నారు. జగన్ నాయకత్వ లక్షణాలు, డైనమిక్, విజనరీ ఆలోచనలకి మెచ్చి ఏపీలో గ్రీన్ ఎనర్జీపై రాబోవు 5-7 ఏళ్లలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని వైజాగ్ సమ్మిట్-2023లో చెప్పారు రెన్యూ పవర్ సంస్థ సీఈవో సుమంత్ సిన్హా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -