- Advertisement -

జగన్ పల్లెబాట..టీడీపీ ‘బాబుతో నేను’

- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలు ప్రచారం జరుగుతున్న వేళ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు ఖరారు కాగా బీజేపీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశం కనిపిస్తోండగా అటు వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒంటరి పోరుకే సై అంటున్నారు. ఇక టీడీపీ అవినీతిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్న జగన్‌…తర్వాత ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారట. ఇందులో భాగంగా ప్రతి సచివాలయానికి జగన్ ఒకరోజు కేటాయించనున్నారు. ప్రతీ మండల కేంద్రంలో మీటింగ్ పెట్టడంతో పాటు అక్కడే రాత్రి బస చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పల్లెబాటలో భాగంగా వైసీపీ శ్రేణులను కలవడంతో పాటు ఆయా మండల కేంద్రాల్లోని ప్రముఖులు,తటస్థులతో భేటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా వెళ్లాయని సమాచారం.దీని ద్వారా ప్రజల్లో వైసీపీ మైలేజ్ మరింత పెరిగి పార్టీ మరింత బలోపేతం అవడంతో పాటు గెలుపు కూడా ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు కూడా దశల వారీగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. చంద్ర‌బాబుతో నేను అనే కార్యక్రమంతో జగన్ సర్కార్‌పై పోరు చేస్తోంది టీడీపీ. ఇందుకు సంబంధించి కరపత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఓ ఫోన్ నెంబర్‌ని క్రియేట్ చేసి మిస్డ్ కాల్ ద్వారా చంద్రబాబు అరెస్ట్‌ని వ్యతిరేకించాలని ప్రజలను కోరుతోంది. చంద్రబాబును జైల్లో ఉంచారనే సింపతిని క్యాచ్ చేసుకోవాలని భావిస్తున్నారు.

ఏదిఏమైనా వైసీపీ – టీడీపీ నేతల వ్యూహా, ప్రతివ్యూహాలతో ఏపీ పాలిటిక్స్‌ రంజుగా సాగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -