ఆహా లో అందుకే బాలయ్య ను దింపారట..

- Advertisement -

తెలుగులో మొట్టమొదటి ఓటిటి ప్లాట్ ఫామ్ గా , ఆహా కు గుర్తింపు లభించింది కానీ, లాభాలు మాత్రం రావటం లేదు. కంటెంట్ విషయంలో మొదటినుంచి ఆహా పై వ్యూవర్స్ కు ఓ విధమైన డిజప్పాయింట్మెంట్ ఉంది. వ్యూవర్స్ ఎక్స్పెక్టెషన్స్ ను రీచ్ అవటంలో ఆహా ఇప్పటికీ వెనకబడి ఉంది. విజయ్ దేవరకొండ , అల్లు అర్జున్ లను బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టినా , దానికి తగ్గ రీచ్ మాత్రం ఆహా కు రావటం లేదు.

నిజానికి కరోనా లాక్ డౌన్ టైమ్ లో అహా ప్రేక్షకుల ఆదరణ పొందింది‌. అప్పుడే ఒరిజినల్ కంటెంట్ కొసం విపరీతంగా ఖర్చు పెట్టింది. కానీ అవి ఎంతవరకు తమకు ఉపయోగపడతాయో ఎనలైజ్ చెసుకొకపోవటం వల్ల దాదాపు యాబై కోట్ల వరకు ఆహా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ వల్ల ఆహా కు ఊహించిన స్దాయి ఆదరణ లభించలేదు.

ఇక డబ్బింగ్ సినిమాలు, థియేటర్ లో రిలీజయిన క్రేజీ మూవీస్ ను తమ‌ సబ్స్క్రైబర్స్ కు చూపిస్తున్నా.. స్పందన అంతంతమాత్రం గానే ఉంది‌. పైగా సరికొత్త సబ్‌స్క్రిప్షన్స్ కూడా ఆశించినంత రాకపోవటంతో, తాజాగా బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ ప్రొగ్రామ్ ద్వారా , నందమూరి అభిమానుల ఆదరణ ఎంతోకొంత పొందెందుకు ప్రయత్నాలు చేశారు. గతంలోలా కంటెంట్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టకుండా , ఆచితూచి బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా చేసిందే అన్ స్టాపబుల్.. మరీ బాలయ్య క్రేజ్ ఎంత వరకు ఆహా కు ఉపయోగపడుతుందో చూడాలి.. !!!

అల్లు వారు ఎంత‌కాలం మెగా ప‌ల్ల‌కీ మోయాలి..

విరాట్ కోహ్లీని ఆ బ్యాచ్ టార్గెట్ చేసిందా..?

టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!

ఆ ఇద్దరు మినిష్టర్ లపై ట్రోలింగ్..

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -