నటుడు కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. స్టూడియో గ్రీన్ సంస్థకు చెందిన కె.ఇ. గ్నానవేల్ రాజా నిర్మాణం, నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం న్యూ-ఎజ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ నేను ‘అన్నగారు వస్తారు’ చేయడానికి ప్రధాన కారణం దర్శకుడు నలన్ కుమారస్వామి. ఆయన చేసిన ‘సూడూ కవ్వుమ్’ సినిమాకు ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మనం సూపర్ హీరోలంటే బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్‌లను గుర్తు చేసుకుంటాం. కానీ మన సంస్కృతిలో NTR, MGR లాంటి మహానుభావులే నిజమైన సూపర్ హీరోలు. వారు సినిమాను, రాజకీయాలను మార్చేశారు. ఆ ఆలోచనతోనే నలన్ 80ల మాస్ కమర్షియల్ హంగులను కొత్తగా చూపించే కథను నిర్మించారు. ఈ సినిమా ఒక కల్పిత ప్రపంచంలో జరుగుతుంది అన్నారు.
రచయితలకు సంపూర్ణ స్వేచ్ఛ లభించినప్పుడే కొత్తరకం సినిమాలు వస్తాయి. లేకపోతే పరిశ్రమ ఒకే ఫార్ములాను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తుంది. నలన్ ఈ సినిమాను Marvel Avengersను గుర్తు చేసే రీతిలో విజువల్స్, మ్యూజిక్‌తో తీర్చిదిద్దారు. ఇది పీరియడ్ ఫిల్మ్ కాదు. ట్రైలర్‌లో కనిపించినట్లుగానే ఇది ఒక పరల్లెల్ వరల్డ్‌లో సాగే సూపర్ హీరో కథ అని అన్నారు.ఈ చిత్రంలో కార్తీ సఫారీ డ్రెస్‌లో కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
