- Advertisement -

బ్లాక్ లిస్టింగ్‌లో ‘ధురంధర్ 2’ !

- Advertisement -

దర్శకుడు ఆదిత్య ధర్‌కు చెందిన నిర్మాణ సంస్థ బీ62 స్టూడియోస్‌ను ‘ధురంధర్ 2’ సినిమా చిత్రీకరణ సమయంలో భద్రతా నిబంధనలు, పౌర నియమాలు పదేపదే ఉల్లంఘించినందుకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఏ-వార్డ్ కార్యాలయం బ్లాక్‌లిస్ట్ చేయాలని సిఫార్సు చేసింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

బీఎంసీ వర్గాల సమాచారం ప్రకారం, చిత్రీకరణ సమయంలో పలు సార్లు నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి. సెట్లో వంట కోసం గ్యాస్ సిలిండర్లు వినియోగించడం నియమాలకు విరుద్ధమని తెలిపారు. అలాగే అవసరమైన అనుమతులు తీసుకోకుండా షూటింగ్ స్థలాన్ని మార్చినట్లు పేర్కొన్నారు.

ఈ ఉల్లంఘనల నేపథ్యంలో ఏ-వార్డ్ కార్యాలయం ఉప మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసి స్టూడియోను బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా బ్లాక్‌లిస్ట్ చేయలేదు. హై సెక్యూరిటీ జోన్‌లో మండే టార్చ్‌లను వినియోగించారని, దీనిని తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించి ముంబై పోలీసులు జోక్యం చేసుకుని పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అనుమతి లేకుండా భవనం టెర్రస్‌పై షూటింగ్ నిర్వహించడం, రెండు జనరేటర్ వాన్లను చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా నడపడం వంటి ఆరోపణలు ఉన్నాయి. బీఎంసీ ఇప్పటికే రూ.25,000 భద్రతా డిపాజిట్‌ను స్వాధీనం చేసుకుని, అదనంగా రూ.1 లక్ష జరిమానా విధించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర సింగిల్-విండో ఫిల్మింగ్ పోర్టల్ ద్వారా భవిష్యత్తులో షూటింగ్‌లపై శాశ్వత నిషేధం విధించాలనే ప్రతిపాదనను కూడా పంపింది. ఈ సినిమా కథ 1999 ఐసీ-814 హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు వంటి దక్షిణాసియా భౌగోళిక-రాజకీయ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -