- Advertisement -

దీపావళి..బాక్సాఫీస్ హిట్ కొట్టేదెవరు?

- Advertisement -

దీపావళి 2025 ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా హాట్‌గా ఉండనుంది. ఎందుకంటే ఒకేసారి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్యూడ్, కిరణ్ అబ్బవరమ్ నటించిన కే-రాంప్, అలాగే ప్రియదర్శి–నిహారిక NM జంటగా నటించిన మిత్ర మండలి.

ఈ నాలుగు చిత్రాలలో తెలుసు కదానే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్ జోన్‌లోకి రావాలంటే రూ.17 కోట్లు షేర్ వసూలు చేయాలి.ప్రదీప్ రంగనాథన్ తన లవ్ టుడే మరియు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అందువల్ల డ్యూడ్ సినిమా మంచి రేటుతో అమ్ముడైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి రూ.10 కోట్లు షేర్ సాధిస్తే హిట్‌గా పరిగణించబడుతుంది.

కిరణ్ అబ్బవరమ్ హీరోగా వస్తున్న కే-రాంప్కు కూడా డీసెంట్ బజ్ ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.6.5 కోట్లు షేర్ వసూలు చేయాలి. మరోవైపు, మిత్ర మండలి సినిమాను హిట్‌గా పరిగణించాలంటే రూ.4 కోట్లకు పైగా షేర్ సాధించాలి. దీపావళి ఈసారి సోమవారం రోజున వస్తుండటంతో, అన్ని సినిమాల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఈ లాంగ్ వీకెండ్‌ మరియు పండగ సీజన్‌ బూస్ట్‌తో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -