Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడిగా అవార్డ్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ శుభవార్త. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలానే సినిమాలో నటించి అభిమానులను అలరించాడు. ప్రతి సినిమాలో విభిన్న పాత్రలో చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోస్ లో ఒకడొగా కొనసాగుతున్నాడు. ఐతే తాజాగా ఎన్టీఆర్ ఉత్తమ నటుడు ఈ అవార్డు దక్కింది. శ్రీ కళాసుద తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మే వ తేదిన చెన్నైలో ఉగాది పూరస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.

ఇందులో భాగంగానే ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా అవర్డ్ అందుకోనున్నాడు. టెంపర్ సినిమాకి గాను ఎన్టీఆర్ కు ఈ అవార్డ్ దక్కనుంది. అలాగే ఈ సినిమాలో నటించిన పోసాని కృష్ణ మురళి కూడా ఉత్తమ సహాయనటుడిగా అవర్డ్ దక్కింది. ఇక ఉత్తమ నటి రుద్రమదేవి సినిమాకి గాను అనుష్క ఎంపికైంది. వీరితో పాటు ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కు బాపు రమణ. అలాగే సీనీయర్ నటి ఆమనికి బాపు బొమ్మ పూరస్కారాలు అందజేయనున్నారు.

ఇక ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కుల కనిషన్ చైర్మన్ జస్టిస్ టి.మీనాకుమారికి, ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనిత దాట్లకు మహిళా రత్న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఇంకా మరెందరో సినీ నటులు ఇతర కేటగురీల్లో ఈ అవార్డులను ఎంపికయ్యారు.

ఆ వివరాలు… ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌ (టెంపర్‌) ఉత్తమ నటి అనుష్క (రుద్రమదేవి) ఉత్తమ ప్రతి నాయకుడు దగ్గుపాటి రానా (బాహుబలి) స్పెషల్‌ జ్యూరి అవార్డ్స్‌ నిత్యా మేనన (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు) శర్వానంద్‌ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు) శివాజీ రాజా (శ్రీమంతుడు) ఉత్తమ సహాయ నటుడు పోసాని కృష్ణమురళి(టెంపర్‌) ఉత్తమ సహాయ నటి హేమ (కుమారి 21 ఎఫ్‌) ఉత్తమ హాస్యనటుడు పృథ్వి (శంకరాభరణం) ఉత్తమ నూతన నటుడు అక్కినేని అఖిల్‌ (అఖిల్‌) ఉత్తమ నూతన నటి ప్రజ్ఞ జేస్వాల్‌ (కంచె) ఉత్తమ చిత్రం శ్రీమంతుడు (మైత్రి మూవీ మేకర్స్‌) ఉత్తమ సంచలనాత్మక చిత్రం బాహుబలి (శోభు యార్లగడ్డ) ఉత్తమ కథ జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్‌)(కంచె) ఉత్తమ కళా దర్శకుడు ‘పద్మశ్రీ’ తోట తరణి (రుద్రమదేవి) ఉత్తమ కథనం క్రాంతి మాధవ్‌ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు) ఉత్తమ దర్శకుడు కొరటాల శివ (శ్రీమంతుడు) ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ (ఖి/0 సత్యమూర్తి,శ్రీమంతుడు) ఉత్తమ ఛాయాగ్రహకుడు సెంథిల్‌ కుమార్‌ (బాహుబలి) ఉత్తమ మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, గోపాల… గోపాల, దొంగాట) ఉత్తమ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర (రుద్రమదేవి) ఉత్తమ గాయకుడు సాగర్‌ (ఖి/0 సత్యమూర్తి, శ్రీమంతుడు) ఉత్తమ గాయని రమ్య బెహరా (బాహుబలి) ఉత్తమ నూతన దర్శకుడు వంశీకృష్ణ (దొంగాట) ఉత్తమ బాల నటి జ్వాల మేఘన (గోపాల… గోపాల)

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -