- Advertisement -

SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లోకి ఐ బొమ్మ!

- Advertisement -

ఐ బొమ్మ రవి కేసులో విచారణ రెండో రోజు కొనసాగింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా SBI టెక్నీకల్ టీంను పిలిపించి అనేక కీలక అంశాలపై వివరాలు సేకరించారు. SBI టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లోకి ఐ బొమ్మకు సంబంధించిన లింక్ ప్రత్యక్షమవడం కేసును మరింత ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ లింక్ ఎలా చేరింది? ఎవరు అప్‌లోడ్ చేశారు? ఏ వ్యవస్థ లోపం కారణంగా ఈ లింక్ కనిపించిందో అనే దానిపై పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు.

SBI టెక్నీకల్ టీం హాజరుకావడంతో, సైబర్ క్రైమ్ అధికారులు పోర్టల్ భద్రత, లాగ్ వివరాలు, యాక్సెస్ హిస్టరీ, అనుమానాస్పద కార్యకలాపాలపై సమగ్ర సమాచారం సేకరించారు. ప్రాథమికంగా ఇది సిస్టమ్‌లో జరిగిన టెక్నికల్ మానిప్యులేషన్‌గా భావిస్తున్నప్పటికీ, అంతర్గత లేదా బాహ్య హ్యాకింగ్ కోణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

పోర్టల్‌లో కనిపించిన ఐ బొమ్మ లింక్‌ను వెంటనే తొలగించేందుకు టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, ఈ లింక్ ఎలా, ఎప్పుడు, ఏ వ్యవస్థ ద్వారా అప్‌లోడ్ అయిందన్న అంశంపై విచారణ మరింత లోతుగా సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -