విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ విషయంపై నిర్మాత నాగ వంశీ స్పందించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగవంశీ.. సినిమా రెండో భాగానికి సంబంధించిన అంశాలపై తన మామ చిన్నబాబుతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మధ్య దాదాపు మూడు నెలల పాటు వాదనలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. కింగ్‌డమ్ ద్వారా కొన్ని సాంప్రదాయాలను (స్టీరియోటైప్స్) బ్రేక్ చేయాలని గౌతమ్ తిన్ననూరి ప్రయత్నించాడని నాగ వంశీ తెలిపారు. జెర్సీ లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడితో ఎంతవరకు వాదించగలం? అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రారంభంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, మొదటి భాగం ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్, మణీష్ చౌదరి, రోహిణి, అయ్యప్ప శర్మ కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని అనిరుధ్ అందించారు.
