పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో చాలానే ప్లాప్ లు ఉన్నాయి. అయితే ‘జానీ’ మూవీ పెద్ద ప్లాప్ గా నిలిచింది. ‘జానీ’ చిత్రం కొన్ని థియేటర్లలో రెండు షోలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి. పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీలో రేణుదేశాయ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ స్వయంగా కథ రాసుకుని, స్క్రీన్‌ప్లేను రాసి దర్శకత్వం వహించిన ఆ సినిమా ఎవరూ ఊహించని విధంగా ప్లాప్ కావడంకు కారణం ఆ చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ అంటూ ఆ సినిమాలో నటించిన రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న రేణుదేశాయ్.. తాజాగా ‘జానీ’ చిత్రంపై స్పందించింది. ముందుగా అనుకున్న కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ కథను మొత్తం మార్చేశారు.
ఆ మార్పులు చేసింది ఎవరు అనే విషయాన్ని రేణు చెప్పక పోయినా కూడా అల్లు అరవింద్ ఆ మార్పులు చేయించి ఉంటాడు అని, కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మొత్తం కథనే మార్చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక మూవీలో చివరకు హీరో చనిపోవాల్సి ఉంటుంది. కాని పవన్ కళ్యాణ్ పాత్రను చనిపోకుండా నిర్మాత చేయడం వల్లే సినిమా ఫ్లాప్ అయ్యిందని కూడా అమె అంచనా వేస్తోంది. అల్లు అరవింద్ కథ మార్చడం వల్ల సినిమా ప్లాప్ కావడంతో పవన్ బాధపడ్డాడని తెలిపింది. ఎప్పటికి అయినా ‘జానీ’ కోసం పవన్ రాసుకున్న అసలు స్టోరీతో మూవీ చేయాలని ఉందని, అందుకోసం తప్పకుండా ప్రయత్నిస్తాను అంటూ రేణుదేశాయ్ తెలిపింది.
{youtube}v=coebN-2LQwo{/youtube}
Related
