Tuesday, May 14, 2024
- Advertisement -

జేపీ నడ్డా కేసులో ఏడుగురు అరెస్ట్.. వారి వెనుక ఎవరు..!

- Advertisement -

బిజేపి అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై బంగాల్​లో రాళ్ల దాడి చేసిన ఘటనలో ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు ఏడుగురిపై రెండు కేసులు పెట్టారు. అయితే షిరాకోల్​, దెపీపుర్​లో అల్లరిమూకను ప్రేరేపించారన్న ఆరోపణలతో బిజేపి నేతల రాకేశ్​ సింగ్​పై ఎఫ్​ఐర్​ నమోదు చేశారు.

గురువారం ఉదయం కోల్‌కతా నుంచి 24 పరగణాల జిల్లాలోని డైమండ్‌ హార్బర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశానికి జేపీ నడ్జా వెళ్తుండగా సిరాకుల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటారుసైకిళ్లపై వచ్చిన దుండగులు ఇటుకలు, రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేస్తూ వెంబడించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

అడ్డుకున్న పోలీసులతోనూ గొడవకు దిగారన్నారు. అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో బృందం సైతం ఇటుకలతో దాడికి పాల్పడిందని బిజేపి నేతలు చెప్పారు. నడ్డా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. బిజేపి నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ వర్గియాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. దాడి సమయంలో ఆందోళనకారులు మీడియాకు, బిజేపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -