- Advertisement -

9ఏళ్ల చిన్నారి జీవితాన్ని చిదిమేసిన మేన‌మామ‌…

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న వారిపై అఘాయిత్యాలు ఆగ‌డంలేదు. చిన్న పిల్లు, ముస‌లి వాళ్లు అని చూడ‌కుండా మృగాల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎక్కువ‌గా ప‌రాయి వాల్ల‌కంటె సొంత బంధువులే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.

వరంగల్‌లో 9నెలల చిన్నారిపై హత్యాచారం, ఒంగోలులో 16ఏళ్ల బాలికపై ఐదు రోజుల పాలు సామూహిక అత్యాచారం వంటి ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాజం ఎటు పోతోందంటూ మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద‌లా ఉంటె తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో తొమ్మిదేళ్ల బాలికపై స్వయానా మేనమామే అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.

రాజేంద్రనగర్‌లోని స్థానిక బ‌స్తీలో తొమ్మిదేళ్ల బాలికపై వరుసకు మేనమామ అయ్యే యువకుడు లైంగికదాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 27న ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు బాలికను సమస్య గురించి ఆరా తీయగా జరిగిన విషయాన్ని వైద్యుడికి తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -