Sunday, May 12, 2024
- Advertisement -

అర్ధరాత్రి టీన్యూస్‌కు ఏపీ సీఐడీ పోలీసులు

- Advertisement -

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నామెనేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ మొదటగా టీన్యూస్ ఛానల్ ప్రసారం చేసినందుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు పంపారు. అర్ధరాత్రి దాటాకా సీఐడీ ఏసిపి రమణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు వచ్చిన పోలీసులు కేబుల్ యాక్ట్ కింద టీన్యూస్ C.E.O కు ఈ నోటీసులు అందజేశారు.

స్టీఫెన్ సన్‌కు చంద్రబాబుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో టేపులు ప్రసారం చేయటం వలన రెండు రాష్ట్రాల్లో విభేదాలు, విద్వేషాలకు దారి తీసే అవకాశం ఉందని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి టీన్యూస్ వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. 

ఇదిలా ఉండగా దీనికి ప్రతి చర్యగా తెలంగాణలో కూడా కేసులు నమోదు అయ్యాయి. టీన్యూస్ ఛానల్‌కు విశాఖపట్టణం పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ న్యాయవాదులు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఏపీ తీరుపై తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం పది జిల్లాలలోని జర్నలిస్టులందరు కలిసి ఏపి డిజిపి ఆఫీసు ముందు ధర్నా చేస్తారని తెలిపారు.  

ఉభయ రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు కేసుతో మొదలైన వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నరు. పాలనను పక్కన పెట్టి ఈ కేసు వ్యవహారం మాత్రమే రాష్ట్రాల సమస్యగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తుండటం ద్యురదృష్టకరంగా ఉందని అంటున్నారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -