చైనాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న పాక్‌కు భవిష్యత్తులో చుక్కలు కనిపించనున్నాయి.చైనా చేపట్టిన ఆర్థిక కారిడార్ లో పాక్ పావుగా మారనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.ఇది పూర్తి అయితే పాక్ పూర్తిగా చైనాకు బానిస కాలనీగా మారనుందని పాక్ రాజకీయ ఆర్థికవేత్త ఎస్ అక్బర్ జైదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కోల్ కతా రీసెర్చ్ గ్రూప్ నిర్వహించిన సమావేశంలో చైనా పాకిస్తాన్ ను స్వాధీనం చేసుకుంటుందనే అంశంపై అక్బర్ ప్రసంగించారు. పాకిస్థాన్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళ్లిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మొదలు పెట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా పాక్‌లో చైనా ఎకనమిక్ కారిడార్ పూర్తయిన తర్వాత ఈ పరిస్థితి తప్పకుండా తలెత్తుతుందన్నారు.
{loadmodule mod_custom,GA1}
మిలటరీ సివిల్ సొసైటీ అండ్ డిమానిస్ట్రేషన్ ఇన్ పాకిస్థాన్, ఇష్యూ ఇన్ పాకిస్థాన్ ఎకానమీ పేరుతో అక్బర్ రాసిన పుస్తకాలు ఆయనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. చైనా ఓబీఓఆర్ కార్యక్రమంలో భాగమైన చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ ను ప్రపంచంలో విస్తరించడానికి పాకిస్థాన్ భౌగోళిక ప్రదేశాన్ని మాత్రమే ఉపయోగించుకుని పర్షియన్ గల్ఫ్ జలాల్లో పాగా వేస్తుందని అన్నారు.దీని వల్ల పాకిస్థాన్‌కు ఉపయేగం ఉండదని …భవిష్యత్తులో తీవ్ర పరినామాలు పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.మరి ఈ విషయంపై పాకిస్థాన్ పరిగణనలోకి తీసుకుంటుందానేది చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}gfAmmoCldAk{/youtube}
