Friday, April 19, 2024
- Advertisement -

అగ్రిగోల్డ్ కేసులో కీల‌క ఆదేశాలు ఇచ్చిన హైకోర్ట్‌…

- Advertisement -

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. కేసును విచారించిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. హాయ్‌లాండ్‌ విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందని యాజమాన్యం కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది . హాయ్‌లాండ్‌ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించాయి. అనంతరం హాయ్‌లాండ్‌ను వేలం వేయాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది.

హాయ్‌లాండ్‌లో కొంతభాగం ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టిన కారణంగా ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసే బాధ్యత బ్యాంకుకు అప్పగించింది. వేలం వేసిన తర్వాత అగ్రిగోల్డ్ ఖాతాదారులకు, బాధితులకు ఎంతివ్వాలి, ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి అన్నది ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది. ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాల్‌లోనే ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని, అప్పడే బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -