ఏపీలో పెద్ద ఎత్తున కల్తీ కల్లు ముఠా గుట్టురట్టయింది. నేతలు కనుసన్నల్లోనే అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ చేస్తుండటం విశేషం. ఎక్సైజ్ పోలీసులు టీడీపీ నేత సురేంద్ర నాయుడుని అదుపులోకి తీసుకున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు నకిలీ మద్యం తయారీపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి లిక్కర్ డిపో నుంచి ఏడాది కాలంగా చీప్ లిక్కర్ స్టాక్ తగ్గించారు.
బెల్ట్ షాపులు ద్వారా నకిలీ మద్యం చీప్ లిక్కర్ బాటిల్స్ విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయలు విలువైన మద్యం సీజ్ చేశారు పోలీసులు. ఇందులో ఏడు రకాల నకిలీ బ్రాండ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.కల్తీ మద్యం తయారు చేసే యంత్రాలు, ముడిసరుకు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
