Friday, March 29, 2024
- Advertisement -

సీపీఎస్ పై జగన్ సర్కార్ యూటర్న్

- Advertisement -

సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు కోరుతున్న వేళ జగన్ సర్కార్ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొస్తామంటూ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. జీపీఎస్ అంటే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ అని వెల్లడించింది. సీపీఎస్ మాదిరిగానే దీనిలో కూడా ఉద్యోగాల కాంట్రీబ్యూషన్‌ తప్పనిసరిగా ఉంటుందని జగన్ ప్రభుత్వం పేర్కొంది.

అధికారులు, మంత్రులు ఉద్యోగ సంఘాలకు జీపీఎస్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ అమలును అంగీకరించబోమంటున్నాయి.

బలవంతంగా తమపై రుద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి. పాత పెన్షన్‌ స్కీమే కావాలని పట్టుబట్టాయి. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు మూడేళ్లుగా జగన్ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నాయి.

పీకేను పార్టీలో చేర్చుకోవాలా వద్దా ?

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

ఉచితాలు కొంప ముంచుతాయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -