Friday, April 19, 2024
- Advertisement -

పీకేను పార్టీలో చేర్చుకోవాలా వద్దా ?

- Advertisement -

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకోవాలా వద్దా అన్నఅంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ లో పీకే చేరిక ఖాయమనుకుంటున్న సమయంలో ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చేరిక, ఆయనకు అప్పగించిన బాధ్యతలపై చర్చించేందుకు సోనియా నివాసం కాంగ్రెస్ సీనియర్ నేతలు సోమవారం కీలక భేటీ నిర్వహించారు.

అయితే కాంగ్రెస్ లో పీకేని చేర్చుకోవడంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను కాంగ్రెస్ లో కొనసాగినా.. తన సంస్థ ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందంటూ ఆదివారం పీకే చేసిన ప్రకటన పైనా ఈ భేటీలో చర్ఛ జరిగినట్లు తెలుస్తోంది.

పీకేను పార్టీలో చేర్చుకోవాలంటే ఆయన మరే పార్టీకీ పని చేయకుండా షరతు విధించాలని సీనియర్ల సూచించినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పీకే పని చేస్తే అది కాంగ్రెస్ నష్టం చేకూరుస్తుందని సీనియర్లు సోనియాతో అన్నట్లు తెలుస్తోంది.

తైవాన్‌పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా ?

కమ్మ మంత్రులపై కుట్రలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -