Wednesday, April 24, 2024
- Advertisement -

ఉచితాలు కొంప ముంచుతాయ్

- Advertisement -

రానురాను ఎన్నికల హామీలు శ్రుతిమించుతున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. మేం గెలిస్తే అది ఉచితంగా ఇస్తాం.. ఇది ఇస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వస్తున్న పార్టీలు..ఆ తర్వాత ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తుండటంపై ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో కొన్ని రాష్ట్రాలు నిలకడ లేని ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం వల్ల భవిష్యత్‌లో ఆర్థిక విపత్తు తప్పదంటూ ఎస్బీఐ హెచ్చరించింది. ఈ మేరకు తన రిసెర్చ్ రిపోర్ట్‌ను సోమవారం విడుదల చేసింది.

తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ , కేరళ తదితర రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల వాటి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతోందని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది. ఈ రాష్ట్రాలు తమ రెవెన్యూ ఆదాయంలో 5 నుంచి 19 శాతం ఉచితాల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. రుణమాఫీ లాంటి ప్రజాకర్షక పథకాలకు వీటిని వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రలకు వచ్చే పన్నులో దాదాపు 53 శాతం ఉచ్చితాల కోసమే ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక తెలంగాణలో అయితే రాష్ట్ర రెవెన్యూలో ప్రజాకర్షక పథకాల వాటా 35 శాతంగా ఉంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఎస్బీఐ అభిప్రాయపడింది.

ప్రజాకర్షక పథకాల వల్ల దీర్షకాలంలో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ ఇటీవలే ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందనీ.. అయితే అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయంటూ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తప్పదన్నారు.

ఏపీ ప్రభుత్వం పరిమితి మించి అప్పులు చేస్తోందంటూ ఒక పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు కూడా అందటం లేదని గగ్గోలు పెడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని పైకి చెబుతున్నా.. ఏపీలో రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని కొందరు నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో 18 రాష్ట్రాల సగటు ద్రవ్యలోటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 4 శాతానికి చేరిందని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది. 7 రాష్ట్రాల్లో ద్రవ్యలోటు …బడ్జెట్ లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. ఇక 11 రాష్ట్రలోనైతే ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలకు సమానంగానో లేదా తక్కువగానో ఉందని వెల్లడించారు. ప్రజాకర్షక పథకాలు, ఉచితాల విషయంలో ఎస్బీఐ తాజా హెచ్చరికలు ప్రధాన్యం సంతరించుకున్నాయి.

ఏపీ నిధుల దారి మళ్లింపుపై సుప్రీం సీరియస్

పరుగులు పెట్టనున్న పోలవరం పనులు

మళ్లీ హస్తినకు కేసీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -