Saturday, April 20, 2024
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించారా? హైకమాండ్ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? అంటే గాంధీభవన్ వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి పూర్తి సహకారం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రేవంత్ రెడ్డిపై పూర్తి నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. అందుకే సీనియర్ నేతలు ఆయనపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. హైకమాండ్ తీరును గమనించిన కొందరు సీనియర్లు రేవంత్ విషయంలో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. మిగితా నేతలు కూడా రేవంత్ రెడ్డితో కలిసి పని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఇదే సంకేతమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఐక్యమత్యమే మహా బలమని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అందుకు భిన్నంగా ఎవరూ పని చేసినా చర్యలు తప్పవని చెప్పారు. పార్టీ వ్యవహారాలు, పార్టీ ముఖ్య నేతలపై ఎవరూ ఓపెన్ గా విమర్శలు చేసినా , సోషల్ మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాదు అడ్డగోలుగా మాట్లాడితే క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడమే కాదు.. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలతో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడొద్దని.. అందరికి అండగా ఉంటానని చెప్పారు.

రేవంత్ దూకుడుతో పార్టీ బలోపేతానికి ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. పార్టీలో, అనుబంధ విభాగాల్లో ఏ స్థాయిలోనూ నియామకాలు జరపవద్దని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిశాకే పదవుల పంపకం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో పీసీసీ అనుమతి లేకుండా జరిగిన పలు నియామకాలను రేవంత్ రెడ్డి రద్దు చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి తీరుతో ఇంతకాలం అసమ్మతిగా ఉన్న నేతలు కూడా దారిలోకి వస్తున్నారని చెబుతున్నారు. రాహుల్ పర్యటన తర్వాత పార్టీలో రేవంత్ రెడ్డి పట్టు మరింత పెరుగుతుందని ఆయన వర్గీయులు అంటున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని చెబుుతన్న రేవంత్ రెడ్డి.. విపక్షాలను టార్గెట్ చేయడంతో పాటు సొంత పార్టీని సెట్ రైట్ చేసే పనిలో పడ్డారని గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.

బండి పాదయాత్రలో టెన్షన్ టెన్షన్

మళ్లీ హస్తినకు కేసీఆర్

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు.. అనిల్ కుమార్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -