Friday, March 29, 2024
- Advertisement -

మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు …

- Advertisement -

వైఎస్ జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్‌ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక బోర్డుల స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిసైడ్‌ అయ్యింది ఏపీ సర్కార్.ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి.ఆర్థికవనరుల కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, నీటి నిర్వహణ, అసమానతల తగ్గింపుపై ఈ బోర్డులు దృష్టి సారిస్తాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు ఛైర్మెన్ తో పాటు సభ్యులు ఉంటారు. ఛైర్మెన్ పదవి మూడేళ్లు ఉంటుంది.ఈ బోర్డులు విజయనగరం(విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం), కాకినాడ (ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా), గుంటూరు(గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), కడప(కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) కేంద్రంగా పనిచేయనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -