Friday, May 3, 2024
- Advertisement -

భారత్ తో యుద్ధం తప్పదు…పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -

కశ్మీర్ పై పాక్ తీరు మారలేదు. పాక్ ప్రధాని నుంచి మంత్రులు అందరూ భారత్ పై అక్కసును వెల్లగక్కారు. అవసరం అనుకుంటె కశ్మీర్ కోసం యుద్ధం చేయడానికి కూడా వెనకాడమని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా మరోసారి అక్కసును వెళ్లగక్కారు. యుద్ధం తప్పదంటూ భారత్ ను రెచ్చ గొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్‌ 370 రద్దుపై త్వరలోనే భారత్‌తో యుద్ధం తప్పదంటూ బెదిరింపులకు దిగాడు. కశ్మీర్‌ లోయలో భారత్‌ విధ్వంసాలకు పాల్పడుతుందని.. హిందుత్వాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించాడు.హిందుత్వకు బాధితురాలిగా కశ్మీర్ తయారైందని చెప్పారు. పాకిస్థాన్ కీలక అజెండా కశ్మీరేనని మరోసారి స్పష్టం చేశారు. భారత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమకు ఓ ఛాలెంజ్ వంటిదని చెప్పారు. కశ్మీర్ ను పాకిస్థాన్ ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టదని అన్నారు. చివర శ్వాస, చివరి బుల్లెట్, చివరి సైనికుడి వరకు తాము పోరాడుతామని చెప్పారు.

కశ్మీర్‌ ప్రజలకు మేం చెప్పేది ఒకటే.. మేం మీకు తోడుగా ఉన్నాం. మీకు భరోసా ఇస్తున్నాం. కశ్మీర్‌ కోసం యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాం’ అన్నాడు.ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని… అయితే, తాము శాంతికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాక్ పాలకులతో పాటు ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు చూస్తె త్వరలో భారత్ తో యుద్ధం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -