- Advertisement -

బార్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఫలించేనా..!

- Advertisement -

న్యాయవాదిగా మూడేళ్లు అనుభవం ఉంటేనే న్యాయాధికారి ఉద్యోగాల పరీక్షలు రాయడానికి అర్హత పొందినట్టుగా నిబంధన పెట్టాలని కోరుతూ బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా (బీసీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. క్షేత్రస్థాయి అనుభవం లేకపోవడంతో కొంత మంది న్యాయాధికారులు కోర్టు వ్యవహారాలను సక్రమంగా చూడలేకపోతున్నారని, అందువల్ల ఈ నిబంధన విధించాలని విజ్ఞప్తి చేయనుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం లా డిగ్రీ పాసయిన వారు ఎవరైనా జ్యుడీషియల్​ సర్వీస్​ పరీక్షలు రాయడానికి అర్హులు. వారికి ఎలాంటి క్షేత్రస్థాయి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. న్యాయవాదిగా ఎలాంటి అనుభవం లేకుండా మేజిస్ట్రేటు, జడ్జి పదవులు చేపట్టిన వారికి ఇతర న్యాయవాదులు, కక్షిదారులతో ఎలా వ్యవహరించాలో తెలియడం లేదని బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్​ తెలిపారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి కూడా ఇదో కారణమని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -