Monday, May 13, 2024
- Advertisement -

అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..! 

- Advertisement -
Bhuma family divides in Nandyal by elections..?
  • నంద్యాల ఉప ఎన్నిక భూమా కుటుంబంలో చిచ్చురేపిందా! 
  • తెలుగుదేశం పార్టీకి పెద్ద విషమ పరీక్షగా మారుతోందా! 
  • టికెట్టు కేటాయింపు విష‌యంలో బాబుకు క‌త్తిమీద సాములాగా మారిందా?  
  • అఖిల ప్రియ స్వ‌రంలో మార్పు క‌నిపిస్తోందా..!
  • అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..!  

ప్ర‌స్తుత ప‌రిస్తితులు చూస్తుంటే అవున‌నే  అనిపిస్తున్నాయి. టికెట్టు విష‌యంలో   భూమా కుటుంబంలోనూ విబేధాలున్నాయనే ప్రచారం ముమ్మ‌రంగా  సాగుతోంది.

 మా కుటుంబంలోనే టికెట్టు ఇవ్వాల‌నీ లేకుండా భూమా అన్న‌కొడుకు   భూమా బ్రహ్మానందరెడ్డివి కేటాయించాల‌నీ భూమా అఖిల ప్రియ మొదట డిమాండ్ చేసినా రాను రాను త‌న స్వ‌రంలో మార్పు క‌నిపిస్తోంది. ఇక్కడ నుంచి పోటీ విషయంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఉత్సాహంగా ఉండగా..ఇప్పుడు  భూమానాగిరెడ్డి కూతుర్లు మాత్రం అదంత ఇష్టంలేదనే మాట వినిపిస్తోంది. ఇక్క‌డ‌నుంచి అఖిల ప్రియ చెల్లులు మౌనికి పోటీ చేసేదానికి ఆస‌క్తితో ఉన్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే కుటుంబంలో విభేదాలు మ‌రింత తారాస్తాయికి చేరే అవ‌కాశాలు లేక‌పోలేదు.

ఉపఎనికి భూమాకుటుంబంతోపాటు టీడీపీలోనే చిచ్చు రేపింది. ఈ చిచ్చు తారా స్తాయికి చేర‌డంతో కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. ఇదే బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టికెట్టు ఎవ‌రికి కేటాయిచినా రాని వారు వేరే పార్టీలోకి మార‌డానికి సిద్దంగా ఉన్నారు. టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఈవిష‌యంలో నిర్ణ‌యం తీసుకోక‌పోయినా పార్టీలో నేతలు బహిరంగ ప్రకటనలకు దిగారు. టెకెట్టు  నాకంటే నాకు అని ప్ర‌ట‌న‌లు చేయ‌డంతో విభేదాలు తీవ్ర‌స్థాయిలో బ‌య‌ట‌ప‌డ్డాయి. పాము చావ‌ద్దు..క‌ర్ర విర‌గ‌ద్దు అన్న చందంగా టికెట్టు ఇస్తే పార్టీలో ఉంటాం లేకుంటే  వైకాపాలోకి వెల్తామ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.

టీడీపీ నుంచి బ‌లంగా టికెట్టు ఆశిస్తున్న శిల్పా మోహ‌న్ రెడ్డి త‌న‌కు కేటాయించాల‌నీ లేకుంటే త‌మ అనుచ‌ర‌గ‌నంతో వైకాపాలో చేర‌డంగానీ లేకుంటే ఇండిపెడెంట్‌గా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. సీనియ‌ర్ నేత మాజీ మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా ఇదే మాట‌లు వినిపిస్తున్నాయి.  ఇక సందిట్లో  సడేమియా అన్నట్టుగా.. ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా ఒక ట్రయల్ వేస్తోంది. మాకూ.. కావాలి అనేస్తోంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో మూడు వర్గాలు టికెట్ పై ఆశలను బయటపెట్టేసుకున్నాయి. 

మ‌రి వీరిలో ఎవ‌రికి టికెట్టు కేటాయించినా ఒక‌రినొక‌రు స‌హ‌క‌రించుకొనే ప‌రిస్తితిల్లో లేరు. సిట్టింగ్ ఎమ్ ఎల్ ఏ ఎవ‌రుమ‌ర‌ణించినా ప్రజాస్వామ్యంలో పార్టీలు పాటించే ధర్మం ప్రకారం చూసుకుంటే.. వాళ్లకు టికెట్ ఇవ్వాలి. వాళ్లకుఇస్తే పై మూడు వర్గాలూ సహకరించవు. ఓడించడానికి శతథా ప్రయత్నిస్తాయి. అదే జ‌రిగితే అది ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ పార్టీకీ లాభించ‌న‌డంలో సందేహంలేదు. ఏవిధంగా చూసుకున్నా టీడీపీకీ విష‌మ‌ప‌రీక్ష‌గా మారింది. టికెట్టు కేటాయించేలోపు ఇంక ఎన్ని ప‌రిణామాలు జ‌రుగుతాయే చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -