Friday, April 19, 2024
- Advertisement -

యుద్ధానికి మమ్మ‌ల్నిపంపించ‌మ‌ని మోదీని కోరుతున్న‌ ఖైదీలు

- Advertisement -

భార‌త జ‌వాన్లపై పుల్వామాలో ఉగ్రదాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం మొత్తం ఈ దాడిని ఖండించాయి. ఉగ్ర‌దాడికి ప్ర‌తిదాడి చేయాల్సిందేన‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఇలా చేతులు క‌ట్టుకుని కూర్చుంటే వారు దాడులు చేస్తునే ఉంటార‌ని చాలామంది అభిప్రాయ‌పుతున్నారు.భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై హింస చోటు చేసుకుంటుండటం దారుణమని వివిధ దేశాల నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలోనే బీహార్ రాష్ట్రానికి చెందిన‌ గోపాల్ గంజ్ జైలులోని కొంద‌రు ఖైదీలు ప్రధాన మంత్ర మోదీకి లేఖ రాశారు.

పుల్వామాలో ఉగ్రదాడి ఘ‌ట‌న‌లో మ‌న జవాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని తెలియ‌గానే మా రక్తం మ‌రిగిపోయింది. ద‌య చేసి ఈ దేశానికి రుణం తీర్చుకునే అవ‌కాశం ఇవ్వండి. యుద్దం వ‌స్తే తాము ముందు నిల‌బ‌డి, పొరాడ‌తామ‌ని వారు ఆ లేఖ‌లో తెలిపారు. ఈ యుద్దంలో తాము మ‌ర‌ణిస్తే అమ‌రలుగా గుర్తించండి,ఒక‌వేళ బ్ర‌తికితే తిరిగి మ‌ళ్లీ జైలుకే వ‌స్తామ‌ని ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో వారు పెర్కొన్నారు. ఈ జైలులో 32 మంది మ‌హిళ ఖైదీలుగా ఉండ‌గా, 754 మంది మ‌గ ఖైదీలు ఉన్నారు. వీరు ప్ర‌ధానికి రాసిన లేఖ‌తో పాటు వారు జైలులో ఉండి సంపాదించిన 50 వేలు డబ్బును కూడా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల‌కు అంద‌జేయాల‌ని వారు కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -